కామారెడ్డి, మే 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆహార భద్రత శాఖకు సంబంధించి ఆరు కేసులకు గాను ఆహార పదార్థాల విక్రయ వ్యాపారులకు రూ. లక్ష జరిమానను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ విధించారు.
ఆహారపు కల్తీకి పాల్పడితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఆహార పదార్థాల విక్రయ వ్యాపారులు కల్తీలేని నాణ్యత కలిగిన ఆహార ప్రదార్థాలు విక్రయించాలని జిల్లా ఆహార భద్రత అధికారి సునీత తెలిపారు. ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. లైసెన్సు లేకుండా ఆహార పదార్థాలు విక్రయిస్తే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.