కామారెడ్డి, మే 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బాన్సువాడ, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన సీఎం క్రీడా పోటీలకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు.
క్రీడల వల్ల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని చెప్పారు. వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతోందని పేర్కొన్నారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.