ఎంపీ అరవింద్‌ సమక్షంలో బీజేపీలోకి

ఎడపల్లి, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్‌ సర్పంచ్‌ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు హైదరాబాద్‌లో నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో శుక్రవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్‌ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన వారికి ఎంపీ అరవింద్‌ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా ఎంపీ అరవింద్‌ మాట్లాడుతూ మోడీ పథకాలకు ఆకర్షితులై ఎడపల్లి మండలంలో బీఆరెస్‌ సర్పంచులు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి సాధ్యమని భావించిన ప్రజలు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. దొరల పాలన, దోపిడీ పాలన అంటే ఎలా ఉంటుందో ఈ తరానికి ప్రత్యక్షంగా చూపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, కేసీఆర్‌ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పేరుతో తన కుటుంబ సభ్యులకు వందల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. ఎనిమిది ఏళ్ల కేసిఆర్‌ పాలన దొరల పాలనను తలపించిందని, బీఆర్‌ఎస్‌ పార్టీలో విసుగెత్తిన ప్రజలు కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేసేందుకే బీజేపీ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »