భీంగల్, మే 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అయ్యప్ప నగర్‌లో ఉన్న విశ్వకర్మ సంఘం – 2 నూతన కార్యవర్గాన్ని శుక్రవారం అమావాస్యని పురస్కరించుకొని పాత సంఘం భవన నిర్మాణంలో కొన్ని నూతన హంగులతో నిర్మాణం చేపట్టిన వాటి నిర్మాణం పూర్తి కావడంతో విశ్వకర్మ సంఘం సభ్యులు అందరూ కూడా పాతసంఘ భవనాన్ని మరియు నూతనంగా ఏర్పాటు చేసుకున్న షెడ్డు హల్‌ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం పాత కార్యవర్గం సభ్యులు అంతా కొత్త కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకొని వారికి బాధ్యతలు అప్పగించారు. సంఘం అధ్యక్షుడుగా జమ్మిలిగిరి ముత్తెన్న, క్యాషియర్ గా తొగిటి ప్రశాంత్ మారుతి, కోళ్లకాడుగా కత్రాజి బుచ్చన్న, గ్రామ కమిటీ మెంబర్‌గా లక్ష్మణ్ చారి, సంఘానికి సలహాదారులుగా రగుల హన్మండ్లు, రావుట్ల అరవింద్, మందం భూమేశ్వర్, రావుట్ల రాజు, గజ్జెల మోహన్‌ను ఎన్నుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు.