ఆలూరు, మే 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను క్యాబినెట్లో ఆమోదించిన శుభ సందర్భంగా ఆలూర్ మడలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి, మంత్రులకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు వీఆర్ఏలు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వీఆర్ఏలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలూర్ మండల అధ్యక్షులు గున్నం సంతోష్, ప్రధాన కార్యదర్శి నల్లయ్య, కోశాధికారి తలారి సంపత్, రాజు, గంగారం, సుమన్, వంశీ, పోతన్న, సరిత, గీత, కళావతి, మండల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.