కామారెడ్డి, మే 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫామ్ -8 నింపి మీ డోర్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఓటర్ల జాబితాల తప్పుల సవరణపై రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ జాబితాలో మీ ఇంటి నెంబర్లు తప్పుగా ఉంటే గుర్తించి ఫామ్ -8 నింపి అప్డేట్ తో మీ గుర్తింపు పదిలం చేసుకోవచ్చని తెలిపారు.
మల్టిపుల్ పోర్షన్స్ ఉన్న ఇల్లు లేదా అపార్ట్మెంట్లలో ఒక ఇంటి నెంబర్‌పై వేరువేరు కుటుంబాలు ఓటర్లుగా నమోదు అయితే ప్రతి ప్లాట్, పోర్షన్‌లలో ఉంటున్న కుటుంబానికి ఒక ఇంటి నెంబర్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇంటి నెంబర్, సరిjైున చిరునామా అప్డేట్ చేయడంలో బిఎల్‌ఓలు మీకు సహకారం అందిస్తారని పేర్కొన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
యువతి, యువకులు వారి ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చని చెప్పారు. 18 ఏళ్ల నిండిన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సాయి భుజంగరావు, అధికారులు నవీన్ కుమార్, నరేందర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.