ఆర్మూర్, మే 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని గోవింద్‌పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సబ్‌సెంటర్ చేపూర్ గ్రామంలో సోమవారం కంటి వెలుగు శిబిరం విజయవంతంగా ముగిసింది. మే 2వ తేదీ నుండి ప్రారంభమై మే 22 సోమవారం ముగిసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని మానస తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరంలో మొత్తం 1818 మందికి కంటి పరీక్షలు చేయగా 237 మందికి ఆర్డర్‌పై కంటి అద్దాలను తెప్పించడం జరుగుతుందని 140 మందికి దగ్గర చూపు లోపం ఉన్నవారికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగిందన్నారు.
58 మందికి మోతిబిందు లోపం ఉన్నట్లు గుర్తించి వారికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ సిఫార్సు చేయడం జరిగిందన్నారు. తదనంతరం చేపూర్ సర్పంచ్ సాయన్న ఆధ్వర్యంలో కంటి వెలుగు క్యాంప్ అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో కంటి వెలుగు క్యాంప్ వైద్యాధికారి హూమెర యాస్మిన్, సూపర్వైజర్ రవీందర్ ఏఎన్‌ఎం సుల్తానా, కంటి వెలుగు డీఈవో మీరాబాయి, ఆప్తమిస్ట్ శ్యామల, ఆశ కార్యకర్తలు జ్యోతి, మంజుల, అనురాధ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.