కామారెడ్డి, మే 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ జిల్లా స్థాయి కబడ్డీ, కోకో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. గెలుపు ఓటమి లను సమానంగా స్వీకరించాలని తెలిపారు.
నేటి ఓటమి రేపటి గెలుపు నకు నాంది పలుకుతోందని చెప్పారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సీనియర్ సిటిజన్ ఫోరంలో టేబుల్ టెన్నిస్ క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి రసూల్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.