కామారెడ్డి, మే 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణిపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం రెండో విడత గొర్రెల పంపిణీ పై పశుసంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
అవగాహన సదస్సులకు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యే విధంగా అధికారులు చూడాలని తెలిపారు. లబ్ధిదారుల నుంచి ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలని చెప్పారు. రెండో విడతలో 6377 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు తమ వాటా ధనంగా రూ.43,750 చెల్లించాలని సూచించారు. ఒకరికి 20 గొర్రెలు, ఒకటి పొటెల్ పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సింహరావు, పశు వైద్యులు పాల్గొన్నారు.