రెంజల్, మే 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్ ఉద్యోగ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జేపీఎస్‌లు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలు నుంచి ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న పంచాయతీ కార్యాదర్శుల కోరికను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వ అదేశాలమేరకు ప్రజలకు వారధిగా పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు సాయిలు, సుమన్, సాయిబాబా, నవీన్ తదితరులు ఉన్నారు.