భారీగా బిజెపిలోకి…

కామారెడ్డి, మే 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్నుర్‌ మండలం తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు, 7వ వార్డు సభ్యుడితో సహా 34 మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చూపు బీజేపీవైపు ఉందని, రాష్ట్రంలో డబల్‌ ఇంజన్‌ సర్కార్‌ కావాలని కోరుకుంటున్నానని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందనీ అన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో పార్టీ పటిష్టంగా ఉందని అన్నారు. వచ్చే 6 నెలలు కీలకం అని ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »