నిజామాబాద్, మే 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర పరిధిలోని మల్లారం గ్రామ శివారులోగల ధాత్రి టౌన్ షిప్లో మూడవ విడత (147) ప్లాట్ల విక్రయానికి సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం అవగాహన సదస్సు గురువారం సమీకృత కార్యాలయాల సముదాయము నిజామాబాద్లో నిర్వహించారు. ధాత్రి టౌన్షిప్ గురించిన పూర్తి వివరాలు తెలిపారు.
ప్లాటు కనీస ధర రూ. 6000 గా నిర్ణయించినట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే రోడ్ల వెయ్యబడ్డాయని, విద్యుత్తు, నీటి సరఫరా, డ్రెయిన్ల నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల చెయ్యడం జరిగిందన్నారు. వారం రోజుల్లో టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. జాన్ నెల 7, 8 తేదీల్లో జరిగే బహిరంగ వేలంలో నగర ప్రజలు పాల్గొని అన్ని రకాల సురక్షితమైన, ఎటువంటి అభ్యంతరాలు లేని ప్రభుత్వ లేఅవుట్ ప్లాట్లను దక్కించుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు.