బాన్సువాడ, మే 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ శ్రీరామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన వారు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో, మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీకళాశాల 1998 సంవత్సరంలో కేవలం మూడు కోర్సులతో ప్రారంభమై నేడు 27 కాంబినేషన్స్ కోర్సుల ద్వారా ప్రతి కోర్సులో 60 మంది విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం ద్వారా రాష్ట్రంలోనే డిగ్రీ కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని ఇటీవల న్యాక్‌చే బి ప్లస్ గ్రేడ్ గుర్తింపు రావడంతో అధ్యాపక బృందంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
మంచి అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, ఆధునికమైన కంప్యూటర్ ల్యాబ్స్, ఆన్లైన్ విద్యా బోధన విశాలమైన తరగతి గదులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యబోధన అందివ్వడం ద్వారా విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలను తీసుకురావడం ద్వారా కళాశాలకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. డిగ్రీ కళాశాలలో ప్రవేశం కొరకు ఆసక్తిగల అభ్యర్థులు మొదటి విడత జూన్ 11, రెండో విడత జూన్ 16 నుండి 27 వరకు, మూడో విడత జులై 1 నుండి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని ఆయన తెలిపారు.