నిజామాబాద్, మే 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం చలో కొత్తగూడెం సిపిఐ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడారు.
బిజెపి హటావో దేశ్ బచావో నినాదంతో ఏప్రిల్ 14వ తేదీ నుండి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో గడపగడపకు గ్రామ గ్రామాన బిజెపి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం ముగింపులో భాగంగా జూన్ 4వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో లక్షలాది మందితో బహిరంగ సభ ఏర్పాటు చేశారన్నారు.
సభకు సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి కె నారాయణ, నాయకులు చాడ వెంకటరెడ్డి, పూనంనేని సాంబశివరావు, పల్ల వెంకట్రెడ్డి తదితర నాయకులు హాజరవుతారన్నారు. నిజామాబాద్ నగరంలో సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఐ నగర నాయకులు రఘురాం నాయక్, బోడమీది అనిల్ కుమార్, పి హనుమాన్లు, జి రమేష్, సాయికుమార్, బాలాజీ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.