ఆర్మూర్‌లో ఘనంగా సావర్కర్‌ జయంతి

ఆర్మూర్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర వీరసావర్కర్‌ 140 వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వీర సావర్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ మాట్లాడారు.

యావత్‌ భారతదేశానికి 140 వ స్వతంత్ర వీర సావర్కర్‌ జయంతి అదేవిధంగా ప్రజాస్వామ్య దేవాలయం అయిన నూతన పార్లమెంటు భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించడాన్ని భారతీయ జనతాపార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతంత్రం కన్నా ముందు స్వాతంత్రం తరువాత ఎవరైనా అంతులేని నరకయాతనను అనుభవించారంటే ఆ గొప్ప దీశాలి, దేశభక్తుడు, స్వతంత్ర పిపాసి అయిన వినాయక దామోదర సావర్కర్‌ అతనినే స్వాతంత్ర వీర సావర్కర్‌గా పిలుస్తామని, స్వాతంత్రం కోసం బ్రిటిష్‌ వారితో పోరాడడమే కాకుండా యువకుల్లో దేశభక్తిని రగిలించడాన్ని జీర్ణించుకోలేని ఆంగ్లేయ ప్రభుత్వం సావర్కర్‌ను అండమాన్‌లోని ‘‘కాలాపాని’’ జైల్లో అత్యంత కఠినమైన జైలుశిక్షను విధించి దున్నపోతులతో తిప్పీంచేటటువంటి గానుగ యంత్రాన్ని వీరసావర్కర్‌తో తిప్పించడం జరిగిందన్నారు.

స్వతంత్ర పోరాటంలో పాల్గొనాలన్న కాంక్షతో ఈ జైలు నుండి మరో జైలుకు ఓడలో తరలిస్తున్న తరుణంలో పాయిఖానాకు వెళ్లాలని చెప్పి ఆపైఖానాలో ఉన్నటువంటి చిన్న రంధ్రం ద్వారా తన శరీరాన్ని సాగదీసి ఒకవైపు శరీరం నెత్తురు కారుతున్న సముద్రంలో ఉప్పు జలాలు ఉంటాయని తెలిసి కూడా ఆ బాధను భరిస్తూ సముద్రంలోకి దూకి పారిపోయే ప్రయత్నం చేశారన్నారు. కొన్ని రోజులకు ఆంగ్లేయులు షరతులు విధించి విడుదల చేయడంతో హిందూ మహాసభ పార్టీ ఏర్పాటు చేసి దానికి జాతీయ అధ్యక్షుడుగా ఉండి స్వాతంత్రం కోసం పోరాటం చేశారన్నారు.

కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ హత్య గావించబడ్డ తరుణంలో వీరసావర్కర్‌ పైన భారత తొలి ప్రధాని నెహ్రూ అకారణంగా అభియోగం మోపి జైలుపాలు చేశారన్నారు. కానీ సుప్రీంకోర్టు నిరపరాధిగ విడుదల చేసినప్పటికిని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, తొలి ప్రధాని నెహ్రూ హిందూ మహాసభ పేరున యువకులలో దేశభక్తిని రగలిస్తున్నాడన్న అక్కసుతో వీర సామర్కర్‌ను గృహ నిర్బంధం చేశారన్నారు.

ఇలాంటి దేశభక్తుని జన్మదినమైన రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంటును ప్రారంభించడాన్ని భారతీయ జనతాపార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్లమెంటు ప్రారంభోత్సవానికి కొన్ని ప్రతిపక్షాలు రాకూడదన్న నిర్ణయం సరైంది కాదని, అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరియు బీఆర్‌ఎస్‌ పార్టీకి భారత ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే నైతిక హక్కు కూడా లేదని, ఎందుకంటే నూతన సచివాలయం ప్రారంభం రోజున తెలంగాణ గవర్నర్‌ను ఆహ్వానించకుండా అవమానించినటువంటి మీరు పార్లమెంటు ప్రారంభం విషయంలో మాట్లాడే అర్హత కోల్పోయారని ఈ సందర్భంగా అన్నారు.

భారత తొలి ప్రధాని నెహ్రూ రాజధండం (సెంగోల్‌) ను అప్పటి చివరి వైస్రాయ్‌ అయిన మౌంట్‌ బాటన్‌ దగ్గర తీసుకొని దానిని అగౌరపరుస్తూ దానిని ఓ వాకింగ్‌ స్టిక్‌ గా భావించి మ్యూజియంలో పెట్టడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు కాంగ్రెస్‌ ఎంత పాటు విలువనిచ్చిందో అర్థమవుతుందని, కానీ నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజధండాన్ని గౌరవిస్తూ నూతన పార్లమెంటు భవనంలో స్పీకర్‌ పక్కన ఉంచడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రస్తుత తరాలకే కాకుండా భవిష్యత్‌ తరాలకు సైతం తెలియజేయడం జరుగుతుందని ఇది ఏందో గర్వకారణమన్నారు.

కావున భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు సజీవంగా ఉండాలన్నా, భారతదేశ దేశభక్తుల చరిత్రలు తెలువాలన్నా, భారతదేశం సర్వశక్తివంతంగా ఉండాలన్న భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని బలపరచడమే మార్గమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్యక్రమంలో బిజెపి సీనియర్‌ నాయకులు బొట్ల విజయ్‌, ద్యాగ ఉదయ్‌, కర్తన్‌ మధు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు విజయానంద్‌, బిజెపి ఆర్మూర్‌ పట్టణ ఉపాధ్యక్షులు పల్లె శ్రీనివాస్‌, దళిత మోర్చ ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్‌ బ్యావత్‌ సాయికుమార్‌, బిజెపి ఆర్మూర్‌ పట్టణ సంయుక్త కార్యదర్శి తోపారం పోశెట్టి, బిజెపి ఆర్మూర్‌ పట్టణ మత్స్య సెల్‌ కన్వీనర్‌ మార్వాడి పోశెట్టి, ఓబీసీ మోర్చ ఆర్మూర్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి మిరియాల్‌ కర్‌ కిరణ్‌, కిసాన్‌ మోర్చా ఆర్మూర్‌ పట్టణ ఉపాధ్యక్షులు నవీన్‌ ఈ రెడ్డి, దళిత మోర్చ ఆర్మూర్‌ పట్టణ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »