నిజామాబాద్, మే 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ హుస్సాముద్దిన్‌ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు.
సోమవారం నాడు హైదరాబాద్ మంత్రుల సముదాయంలో తన అధికారిక నివాసంలో మంత్రిని హుస్సాముద్దిన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా హుస్సాముద్దిన్ కు మంత్రి శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరింతగా రాణించాలని నిజామాబాద్ గడ్డ, తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయాలని కాంక్షించారు.