కామారెడ్డి, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 9న అన్ని నియోజకవర్గాల్లో ఆరు యూనిట్ల చొప్పున గొర్రెలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం రెండో విడత గొర్రెల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గొర్రెలను కొనుగోలు చేసే అధికార బృందం మొబైల్ అప్లికేషన్ శిక్షణ పూర్తి చేశారని తెలిపారు. గొర్రెలు కొనుగోలు చేసే విధానాన్ని మొబైల్ యాప్‌లో నమోదు చేసే విధానాన్ని తెలిపారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సింహరావ్ మాట్లాడారు. 350 దరఖాస్తులు అప్లోడ్ చేశామని తెలిపారు. 120 మంది లబ్ధిదారులు వాటాదనాన్ని చెల్లించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారులు డాక్టర్ దేవేందర్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.