జూన్‌ 4 న బహుజన చైతన్య సభ

నిజామాబాద్‌, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లిలో జూన్‌ 4 న బహుజన చైతన్య సభ పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని జిల్లా ఇంచార్జి గైని గంగాధర్‌ అన్నారు. మంగళవారం బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూసల గల్లీలో జిల్లా ఉపాధ్యక్షులు సిలుమల గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి గైని గంగాధర్‌ విచ్చేసి మాట్లాడారు.

జూన్‌ 4 న డిచ్‌పల్లి కేంద్రంలోని ఎస్‌ఎల్‌జి ఫంక్షన్‌ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బహుజన చైతన్య సభ భారీ ఎత్తున నిర్వహించనున్నామని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఈ సభకి ముఖ్యఅతిథిగా రానున్నారని, యువకులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.

60 ఏళ్ల సుదీర్ఘ ప్రజా ఉద్యమ ఫలితంగా 1200 మంది అమరులు త్యాగంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశలు ఆశయాలు అడియాశలు అయ్యాయని ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నేటి బిఆర్‌ఎస్‌ నాయకులైన కేసీఆర్‌ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి వాటిని విస్మరించడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా నీళ్లు నిధులు నియామకాలు అన్న హామీలను తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలను, నిరుద్యోగులకు అన్యాయం చేశారన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు గణేష్‌ మాట్లాడుతూ..మలిదశ ఉద్యమకారుడు, కళాకారుడు 2019 నిజామాబాద్‌ పార్లమెంటరీ అభ్యర్థి నిరంతర ప్రజా సమస్యలపై కొట్లాడుతూ రూరల్‌లో ప్రజలను సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, నిరంతరం సమస్యలపై కొట్లాడుతూ ప్రజలపక్షంగా పోరాడుతున్న యువ నాయకులు కళా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రూరల్‌ నియోజకవర్గంలోని డిచ్పల్లిలో బహుజన చైతన్య సభకు బహుజన సైనికులు తరలిరావాలని రూరల్‌లో జరుగుతున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహించ తలపెట్టిన సభను విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో రూరల్‌ ఇంచార్జి కళ శ్రీనివాస్‌, బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎర్రోళ్ల గంగాధర్‌, రూరల్‌ నియోజకవర్గ అధ్యక్షులు పోతే ప్రవీణ్‌ బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »