కామారెడ్డి, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని స్టేషన్ రోడ్ లో బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వ్యవసాయదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, జాహ్నవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, కౌన్సిలర్ అపర్ణ, హెచ్డిఎఫ్సి సర్కిల్ హెడ్ మహేష్ నాయుడు, క్లస్టర్ హెడ్ సిహెచ్. రమేష్, బ్రాంచ్ మేనేజర్ గంగామోహన్, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.