అనంతపురం, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలను టార్గెట్ చేస్తూ ఆభరణాలు ఎత్తుకెళ్లే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మాయమాటలతో మహిళలను పరిచయం చేసుకొని ఫోన్నెంబర్లు, అడ్రస్ సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇంటికెళ్లి కూల్ డ్రిరక్స్లో నిద్ర మాత్రలు కలిపి ఆభరణాలు అపహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20చోట్ల ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడిరచారు. చాకచక్యంగా రూరల్ పోలీసులు దొంగలను పట్టుకున్నారు. నిందితుడు నెల్లూరు జిల్లాకు చెందిన చేవూరి చంద్రగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.