కామారెడ్డి, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్రామపంచాయతీ, మున్సిపల్ నీటిపారుదల, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి హామీ, సహకార, పోలీస్, పరిశ్రమల, విద్యుత్తు తదితర శాఖల అధికారులు దశాబ్ది వేడుకల ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.