కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం తొలి ఏకాదశి సందర్భంగా పతంజలి యోగ జిల్లా అధ్యక్షులు రామ్‌రెడ్డి యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి యోగ అవసరమని మనము ప్రతిరోజు ఉదయము బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల లోపు నిద్రలేచినట్లైతే మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని, ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. యోగా చేయడం …
Read More »Monthly Archives: June 2023
నేటి పంచాంగం
గురువారం, జూన్ 29, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : ఏకాదశి రాత్రి 10.34 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 1.10 వరకుయోగం : సిద్ధం రాత్రి 1.25 వరకుకరణం : వణిజ ఉదయం 10.39 వరకుతదుపరి భద్ర రాత్రి 10.34 వరకువర్జ్యం : సాయంత్రం 6.49 – 8.26దుర్ముహూర్తము : ఉదయం 9.52 – 10.44 మరియు …
Read More »మళ్లీ టమాటా మంట -సెంచరీ దాటిన పచ్చిమిర్చి
హైదరాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టమాటా రేటు మరోసారి మండిపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా రూ.80 నుంచి రూ. 100 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉంది. కిలో పచ్చిమిర్చి రూ.120 కి పైగా ధర పలుకుతోంది. ఇవి హోల్ సేల్ మార్కెట్ ధరలు కాగా.. రిటైల్‌గా అమ్మే అంగళ్ళలో వీటి ధరలు మరింత …
Read More »గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు
కామారెడ్డి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి సాగు చేసిన వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గంజాయి సాగు చేసిన వ్యక్తులకు రైతుబంధు, బీమా, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నిలిపివేస్తామని …
Read More »ఎన్‌సిటిఈ నిబంధనలు తప్పక పాటించాలి..
కామరెడ్డి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బి.ఎడ్ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న చాలా కళాశాలలో ఎన్సిటిఈ నిబంధనలను బి.ఎడ్ కళాశాలలు పాటించడం లేదని, విద్యార్థుల సంఖ్య …
Read More »పారదర్శకంగా ఓటర్ల జాబితా
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా తుది ఓటర్ల జాబితా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ బుధవారం ఆయా శాసన సభ నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్‌లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం …
Read More »గ్రూప్-4 పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీ ఎస్ పీ ఎస్ సీ) ద్వారా జూలై 1 వ తేదీన జరుగనున్న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. గ్రూప్-4 పరీక్షలను పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల …
Read More »జిల్లా ప్రజలకు ప్రముఖుల బక్రీద్ శుభాకాంక్షలు
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ …
Read More »గొప్ప దార్శనికుడు పి.వి.
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత పూర్వ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు తన దార్శనికతతో భారతదేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్ది భావి భారతానికి బంగారు బాటలు వేశాడని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. కేర్ డిగ్రీ కళాశాలలో బుధవారం పివి నరసింహారావు జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ పీవీ నరసింహారావు బహుభాషా వేత్తగా సాహిత్య సృజన …
Read More »ఓటరు జాబితా రూపొందించేందుకు పటిష్ట చర్యలు
కామారెడ్డి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ పారదర్శక ఓటరు జాబితా తయారీలో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఈవీఎం గోదాంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఓటరు …
Read More »