నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఐ.డీ.ఓ.సీలో నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య …
Read More »Daily Archives: June 1, 2023
3న రైతు దినోత్సవం
కామారెడ్డి, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 3న రైతు దినోత్సవం వేడుకలకు అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రైతు దినోత్సవం సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతుబంధు, బీమా, ఉచిత విద్యుత్తు ద్వారా ప్రయోజనం పొందిన రైతులతో సమావేశంలో మాట్లాడిరచాలని తెలిపారు. మండల …
Read More »గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఎస్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈనెల 11న గ్రూప్ -1 పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లపై చీప్ సూపరిండ్లతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు …
Read More »హెచ్‌ఐవిపై అవగాహన ర్యాలీ
బాన్సువాడ, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో సంపూర్ణ సురక్ష హెచ్‌ఐవి, ఎయిడ్స్ అవగాహన ర్యాలీ స్థానిక సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిపిటిసి కౌన్సిలర్ శ్రీలత, ఐసిటిసి కౌన్సిలర్ నర్సింలు, హెచ్‌ఐవి పేషెంట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నెలకోకసారి వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు, గ్రామపంచాయతీ …
Read More »తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, కలెక్టర్
నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, అనేక త్యాగాల ఫలితంగా ఆరు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల …
Read More »ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
బాన్సువాడ, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనీ ఆపరేషన్ థియేటర్ గదిలో గురువారం ఎసి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించడంతో ఆసుపత్రి బెడ్లు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. రోగులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు వ్యాపించకుండ అదుపు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సుపరింటెండెంట్ …
Read More »జూన్ 5 నుండి మధ్యాహ్న భోజన కార్మికుల రిలే దీక్షలు
నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, మధ్యాహ్న భోజన వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. చక్రపాణి, జిల్లా అధ్యక్షురాలు బైరి సాయమ్మలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ …
Read More »తెలంగాణ వాతావరణం
హైదరాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో విస్తరించేందుకు దాదాపు మరో వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. రుతుపవనాల ప్రవేశంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు చెప్పింది. చిరుజల్లులను చూసి తొందరపడి రైతులు విత్తనాలు విత్తుకోవద్దని సూచించింది. చిరుజల్లులకు విత్తనాలు విత్తుకుంటే భూమిలో మొలకలు …
Read More »దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన రైతు వేదికలు
నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రైతు వేదికలు ముస్తాబయ్యాయి. రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని రైతు వేదికలను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ మూడవ తేదీన రైతు వేదికల్లో రైతు దినోత్సవ …
Read More »