వేడుకలకు ముస్తాబవుతున్న జిల్లా కార్యాలయాలు

నిజామాబాద్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఐ.డీ.ఓ.సీలో నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

అంతకుముందు వినాయకనగర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్‌, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పుర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా పాలనాధికారి నేతృత్వంలో తుది ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రభుత్వం అట్టహాసంగా చేపడుతున్న దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలతో శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో మరింత విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »