కామారెడ్డి, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 3న రైతు దినోత్సవం వేడుకలకు అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రైతు దినోత్సవం సన్నాహక సమావేశం నిర్వహించారు.
రైతుబంధు, బీమా, ఉచిత విద్యుత్తు ద్వారా ప్రయోజనం పొందిన రైతులతో సమావేశంలో మాట్లాడిరచాలని తెలిపారు. మండల రైతు బంధు సమన్వయ సమితి కన్వీనర్లు, సభ్యులు రైతు దినోత్సవం వేడుకగా నిర్వహించాలని చెప్పారు. రైతు దినోత్సవం గోడప్రతులను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, మండల రైతు బంధు సమన్వయ సమితి కన్వీనర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.