దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన రైతు వేదికలు

నిజామాబాద్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రైతు వేదికలు ముస్తాబయ్యాయి. రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని రైతు వేదికలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ మూడవ తేదీన రైతు వేదికల్లో రైతు దినోత్సవ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించనున్నారు.

ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లా స్థాయిలో ఉమ్మడి జిల్లా అధికారులతో పాటు నియోజకవర్గ స్థాయిలోనూ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేసిన విషయం విధితమే. మంత్రి ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా రైతు దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ కోసం అన్ని రైతు వేదికలను విద్యుత్‌ దీపాల వెలుగులతో అలంకరించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »