కామారెడ్డి, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఎస్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈనెల 11న గ్రూప్ -1 పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లపై చీప్ సూపరిండ్లతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
జిల్లా కేంద్రంలో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లైజన్ ఆఫీసర్లను నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి వేయిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు.
ఇన్విజిలేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పరీక్షల విభాగం అధికారులు డాక్టర్ కిష్టయ్య, శంకరయ్య, లింగం, చీఫ్ సూపర్డెంట్లు మధుసూదన్ రెడ్డి, సాయిబాబా, రాజేశ్వరరావు, నరేందర్, సైదయ్య, సురేష్ బాబు, శ్యాంసుందర్, రమణయ్య పాల్గొన్నారు.