బాన్సువాడ, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో సంపూర్ణ సురక్ష హెచ్‌ఐవి, ఎయిడ్స్ అవగాహన ర్యాలీ స్థానిక సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిపిటిసి కౌన్సిలర్ శ్రీలత, ఐసిటిసి కౌన్సిలర్ నర్సింలు, హెచ్‌ఐవి పేషెంట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నెలకోకసారి వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు, గ్రామపంచాయతీ కార్యదర్శి, ప్రశాంతి, ఉప సర్పంచ్, సొసైటీ చైర్మన్ గంగుల గంగారం, గ్రామ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, లక్ష్మగౌడ్, టిఐ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.