బాన్సువాడ, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనీ ఆపరేషన్ థియేటర్ గదిలో గురువారం ఎసి షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించడంతో ఆసుపత్రి బెడ్లు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. రోగులు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు వ్యాపించకుండ అదుపు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సుపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం వలన రోగులకు సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో సుమారు 30 లక్షలు అస్తి నష్టం జరిగినట్లు తెలిపారు.