నిజామాబాద్, జూన్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు, ప్రాక్టికల్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈనెల 5వ తేదీ నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిజామాబాద్ బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఖిల్లా) లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల ఇతర అన్ని కళాశాలలకు సంబంధించిన సైన్స్ గ్రూపు లు, మరియు అన్ని ఒకేషనల్ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులందరికీ నిజామాబాదులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (ఖిలా)లో మాత్రమే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లు, సంబంధిత గ్రూపుల అధ్యాపకులు విద్యార్థులకు ఈ విషయాన్ని కచ్చితంగా తెలియజేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి ఆదేశించారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థుల హాల్ టికెట్లు ఆయా కళాశాలల్లోని లాగిన్‌లో ఇంటర్ బోర్డు ఆన్లైన్లో పొందవచ్చని పేర్కొన్నారు.