నిజామాబాద్, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ బాసర ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సకల కలల వరప్రదాయిని బాసర జ్ఞాన సరస్వతి ప్రాంగణంలో ఏదేని ఒక సామాజిక అంశంపై కవి సమ్మేళనం ఉంటుందని అఖిలభారత రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కవి సమ్మేళనంలో పాల్గొనదలచిన ఆసక్తి గల కవులు, కవయిత్రులు తమ పేర్లు నమోదు చేసుకొనుట కొరకై 99483 75895 నెంబర్లో సంప్రదించాలని కంకణాల రాజేశ్వర్ కోరారు.