కామారెడ్డి, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్లు పోటీపడి మిల్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం రైస్ మిల్ యజమానులతో మిల్లింగ్ లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
2022-23 ఖరీఫ్ ధాన్యాన్ని సెప్టెంబర్ 30లోగా మిల్లింగ్ పూర్తి చేయాలని తెలిపారు. మిల్లింగ్ సకాలంలో పూర్తిచేయని రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. యాసంగిలో తడిచిన ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్ యజమానులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
వచ్చే ఖరీఫ్ లో రైతులు ముందస్తుగా వరి నాళ్ళు పోసుకునే విధంగా వ్యవసాయ అధికారుల ద్వారా అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎఫ్సిఐ డి .ఎం. అభిషేక్ సింగ్, డిఎస్‌ఓ పద్మ, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల లింగం, ప్రతినిధులు పాల్గొన్నారు.