కామారెడ్డి, జూన్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నుంచి ధరణి టౌన్ షిప్లో ఓపెన్ ప్లాట్లు, వివిధ దశల్లో పూర్తయిన ఇళ్లను వేలం పాట ద్వారా విక్రయిస్తామని కామారెడ్డి రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు.
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జూన్ 5 నుంచి 8 వ తేదివరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.