గోవింద్‌ పెట్‌లో అమ్మ ఒడి

ఆర్మూర్‌, జూన్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోవింద్‌ పెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యురాలు మానస మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ అని తెలియగానే క్రమం తప్పకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని ఉండాలని ప్రసవ సమయంలో రక్తస్రావం అధికంగా ఉంటుంది కాబట్టి హిమగ్లోబిన్‌ అధికంగా ఉండేటట్లు క్యారెట్‌ బీట్రూట్‌ కోడిగుడ్డు పల్లి పట్టిలు బెల్లంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యురాలు సూచించారు.

కార్యక్రమంలో గర్భిణీలను పరీక్షించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్వైజర్‌ ఆనవాల, స్టాఫ్‌ నర్స్‌లు తరంగణి, కల్పన, ఆరోగ్య కార్యకర్తలు ఎస్తేరు రాణి, సుల్తానా, విజయ, హిమజ, శ్యామల గర్భిణి స్త్రీలు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »