కామారెడ్డి, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లతా (28) గర్భిణీకి అత్యవసరంగా ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం బోధన్, నిజామాబాద్ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న రాజాగౌడ్ వెంటనే స్పందించి 28వ సారి ఏ నెగిటివ్ రక్తాన్ని అందజేసి ప్రణాదాతగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఓ,ఏ,బి,ఏబి నెగిటివ్ రక్తానికి సంబంధించిన గ్రూపులు లభించడం చాలా కష్టమని ఈ రక్తం కలిగిన రక్తదాతలు మానవతా దృక్పథంతో రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.
రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్ వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు ఏసు గౌడ్, చందన్ పాల్గొన్నారు.