కామారెడ్డి, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో అధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మిషన్ నేను సైతం సమాజం కోసం అనే ట్యాగ్ లైన్తో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సదర్భంగా ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పర్యావరణంలో మార్పులు వల్ల ఎన్నో అనర్థాలను చూస్తున్నాము. ఇలాంటి సమయంలో మనవంతుగా ఒక మొక్కను నాటి పరిరక్షించాలని ఎన్జీవో తరుపున పిలుపు మేరకు వంద మంది వాలంటీర్స్ ముందుకు వచ్చి మొక్కలు నాటారు. వారందరికీ అభినందిస్తూ ప్రశంస పత్రాలను అందజేసి, అభినందనలు తెలిపామన్నారు.