కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ

కామారెడ్డి, జూన్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్‌ లో విద్యుత్‌ విజయోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును తమ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వ్యవసాయానికి కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం రైతులకు విద్యుత్తు లేక నీళ్లు ఆగిపోతాయని దిగులు లేదన్నారు. మోటర్‌ కాలిపోతుందన్న భయం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

విద్యుత్‌ అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది కొత్త సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయించి రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావం కన్నా ముందు కేవలం 34 మెగావాట్లు ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 256 మెగావాట్లకు సోలార్‌ విద్యుత్‌ ద్వారా పెంచుకున్నట్లు తెలిపారు. షెడ్యూల్‌ కులాలు, తెగల వినియోగదారుల గృహాలకు ప్రతినెల ఒక వంద ఒకటి యూనిట్ల వరకు విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని చెప్పారు.

2014లో జిల్లాలో సాగు విస్తీర్ణం 3 లక్షల 33 ఎకరాలు ఉండగా ప్రస్తుతం ఐదు లక్షల 11, 579 ఎకరాలకు చేరిందని చెప్పారు. హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం, మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులు పునరుద్ధరణ చేయడం వల్ల భూగర్భ జాలాలు పెరిగాయి. విద్యుత్‌ సౌకర్యం 24 గంటల పాటు నిరంతరాయంగా ఇవ్వడం వల్ల బోర్ల ద్వారా నీటిని పంట పొలాలకు అందించడం వల్ల సాగు విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా విద్యుత్‌ సమస్యలను పరిష్కారం చేసినట్లు తెలిపారు. 24 గంటల పాటు వ్యవసాయ రంగానికి నిరాటంకంగా విద్యుత్‌ ఇవ్వడం వల్ల కలిగిన ప్రయోజనాలను రైతులు వివరించారు. విద్యుత్‌ ఘాతంతో మృతి చెందిన రెండు రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు సంస్కృతి కార్యక్రమాలు చేపట్టారు.

సమావేశంలో విద్యుత్‌ శాఖ డిఈ సాలియా నాయక్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »