ఆర్మూర్, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ హన్మాన్ మందిరంలో బుధవారం భక్తి శ్రద్దలతో ధ్వజస్థంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పురోహితులు ఆంజనేయశర్మ, దినేష్ శర్మలు ఉదయం ఆలయ సంప్రోక్షణ, పాత ధ్వజ స్థంభ తొలగింపు, ప్రత్యేక పూజలు అనంతరం నలుగురు దంపతులచే యజ్ఞం నిర్వహించారు.
మందిర కమిటి అధ్యక్షులు పుప్పాల శివరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాలనీ కమిటి అధ్యక్షులు గోసికొండ అశోక్, రాజేంధర్ గౌడ్, దుగ్యాల శ్రీనివాస్, లింబాద్రిగౌడ్, సదమస్తుల గణపతి, చింత నరహరి, లక్ష్మయ్య, భూమయ్య, ఎల్.టి.కుమార్, బాస మోహన్, గడ్డం శంకర్, రాపెల్లి సతీష్, ముత్తన్న పాల్గొన్నారు.