రెంజల్, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ నిధుల ద్వారా మంజూరైన రూ: లక్ష ఇరవై వేల రూపాయల వ్యయంతో గాంధీ విగ్రహం వద్ద నిర్మించిన హైమ్యాక్స్ లైటింగ్ ను ఎంపీపీ రజిని కిషోర్, జెడ్పిటిసి విజయ సంతోష్ స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్‌లతో కలిసి శనివారం ప్రారంభించారు.
మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అత్యాధునిక హంగులతో లైటింగ్ ను ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేయడం ద్వారా రాత్రి వేళల్లో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.