కామారెడ్డి, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి నియోజవర్గానికి వివిధ అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల 64 లక్షల 25 వేల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. హెల్త్ డిపార్ట్మెంట్ కొరకు ఒక్క కోటి 80 లక్షలు, నియోజవర్గ అభివృద్ధి కొరకు వివిధ పనులకు 60 లక్షల 90 వేల రూపాయలు, మంచినీళ్ల ప్రోగ్రాం కొరకు ఆర్గమెంటేషన్ ఆప్ పైపులైన్ 23 లక్షల 35 వేల రూపాయలు మంజూరయ్యాయని, మొత్తం 2 కోట్ల 64 లక్షల 25 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా 2006 సంవత్సరంలో కాచాపూర్ సింగిల్ విండో పిఏసిఎస్‌ను బస్వాపూర్ పిఏసిఎస్‌లో విలీనం చేయడం జరిగిందని, కేవలం రాజకీయ కుట్ర తోటి బస్వాపూర్ సింగిల్ విండో సిస్టన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్న షబ్బీర్‌అలీ కాచపూర్ సింగిల్ విండోను బస్వాపూర్ లో విలీనం చేయడం జరిగిందని తెలిపారు. సమావేశంలో జెడ్పిటిసి రామ్ రెడ్డి, ఎంపీపీ ఆంజనేయులు, ప్రభాకర్ రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షులు భాను ప్రసాద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.