హైదరాబాద్, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వడగాడ్పులు, భానుడి భగభగల నుంచి ప్రజలకు ఉపశమనం కలగనుంది. నిన్న కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురవగా, ఈరోజు , రేపు ఉభయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. తెలంగాణలోని హైదరాబాద్‌లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరోవైపు ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతల్లో ఈనెల 25 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.