రెంజల్, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ రూప అదృశ్యమైనట్లు ఎస్సై సాయన్న తెలిపారు.ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత వర్ని గ్రామానికి చెందిన కొక్కొండ రూపను గత పదహారేళ్ల కిందట కూనేపల్లి గ్రామానికి చెందిన రొడ్డ రవితో వివాహం జరిగింది. కొన్నేళ్ల వరకు భార్య భర్తల సంసారం సజావుగానే సాగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కొంతకాలంగా భార్య భర్తల మధ్య మనస్పార్ధాలు పెరిగి గొడవలకు దారితీసింది. విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు నిర్వహించారని చెప్పారు. ఈనెల 6న భర్త రవి తన మామ అయిన సాయిలుకు ఫోన్ చేసి రూప లేదని సమాచారమిచ్చాడు. ఆమె తండ్రి బంధువుల ఇండ్లలో వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసినట్టు ఎస్సై తెలిపారు. వివాహిత తండ్రి కొక్కొండ సాయిలు ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.