13న మహిళా సంక్షేమ దినోత్సవం

నిజామాబాద్‌, జూన్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నియోజకవర్గ స్థాయిలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంకు సంబంధించి వేల్పూర్‌ మండలం లక్కోరాలోని ఏ.ఎన్‌.జి ఫంక్షన్‌ హాల్‌ లో ఉదయం 10 గంటలకు జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొంటారని అన్నారు.

మహిళల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి మహిళా దినోత్సవ సభలో వివరించడం జరుగుతుందన్నారు. ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని వివరించారు. ప్రజా ప్రతినిధులు, మహిళలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »