కామారెడ్డి, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 14 న నియోజకవర్గ కేంద్రాలలో తెలంగాణ వైద్య, ఆరోగ్య దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వైద్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేల సహకారంతో వేడుకలు విజయవంతమయ్యే విధంగా చూడాలన్నారు.
సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు వేడుకలు హాజరయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్లకు సన్మానం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర వైద్య విదాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ,జిల్లా వైద్యాధికారి లక్ష్మన్ సింగ్, కామారెడ్డి, బాన్సువాడ ఆస్పత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి, శ్రీనివాస ప్రసాద్, వైద్యుడు సంగీత్ కుమార్, చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.