ఎల్లారెడ్డిలో ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవం

కామారెడ్డి, జూన్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్‌ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. అంగన్వాడి కార్యకర్తల గౌరవాన్ని పెంపొందించేందుకు, కేంద్రాల్లో సేవలు సమర్థవంతంగా అందించేందుకు సిబ్బందికి అందించే గౌరవేతనాన్ని ప్రభుత్వం పెంచిందని తెలిపారు. గతంలో అంగన్వాడీ టీచర్‌ వేతనం నెలకు 4,200 ఉండేదని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు రూ. 13,650 వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు.

గర్భిణీలకు న్యూట్రిషన్‌ కిట్టును ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేసుకున్న మహిళలకు కేసీఆర్‌ కిట్‌ తో పాటు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం ఆరోగ్యలక్ష్మి, ఆరోగ్య మహిళా వంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మహిళలు చదువుకొని తనకాళ్లపై తాను నిలబడిన తర్వాత పెళ్లి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేసిందని తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని చెప్పారు. రాష్ట్రంలో అతి తక్కువ పోషకార లోపంతో ఉన్న పిల్లలు కామారెడ్డి జిల్లాలోని ఉన్నారని పేర్కొన్నారు. ఆరోగ్య మహిళా పథకం ద్వారా ఎర్రపాడు, డోంగ్లి, బీర్కూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో మహిళలకు 8 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు వ్యవసాయంతో పాటు చేపల పెంపకం చేపట్టడం వల్ల ఆర్థిక స్వాలంబన సాధిస్తున్నారని తెలిపారు.

సదాశివ్‌ నగర, లింగంపేట మండలాల మహిళలు చేపల పెంపకం చేపట్టారని చెప్పారు. ఆరోగ్య లక్ష్మీ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల బాల్యవివాహాలు పూర్తిగా నిరోధించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్‌ సిడిపిఓ పద్మ మాట్లాడారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలు తమకు వేతనాలు పెంచడం వల్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సిఎంఆర్‌ఎఫ్‌, కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు దాండియా ఆడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేందర్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పాల్గొన్నారు. ఈ వేడుకలు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »