కామారెడ్డి, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15న పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో భాగంగా ఈనెల 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి వేడుకలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో పల్లె ప్రగతి తర్వాత పారిశుధ్యం, పచ్చదనం మెరుగైన తీరును గ్రామీణులకు వివరించాలని తెలిపారు.
పట్టణ ప్రగతి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు, పచ్చదనం ప్రాముఖ్యతను తెలియజేయాలని చెప్పారు. ఈ నెల 17న గిరిజన తండాల్లో గిరిజన ఉత్సవం వేడుకలు ఘనంగా జరిపేందుకు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈనెల 18న మంచినీటి దినోత్సవం వేడుకలు జరపాలని కోరారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్రప్రతాప్, డిఆర్డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పి సీఈవో సాయగౌడ్, అధికారులు పాల్గొన్నారు.