బాన్సువాడ, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని కొనాబాన్సువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కొంతం వెంకటేశం, నాయకులు కిరణ్,తో కలిసి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని అందులో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేయడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఉచితంగా ఏకరూప దుస్తులను పంపిణీ చేయడం జరుగుతుందని కావున విద్యార్థులు పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చి సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొంతం వెంకటేశం, నాయకులు కిరణ్, ఉపాధ్యాయ బృందం, విద్యా కమిటీ చైర్మన్ వినోద, తదితరులు పాల్గొన్నారు.