అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

కామారెడ్డి, జూన్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జంగంపల్లి గ్రామంలో 6.45 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో 6 కోట్ల 45 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన కేజివిబి పాఠశాల అదనపు గదులు, పల్లె దవాఖాన, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ నిర్మాణం పనులకు, సీసీ రోడ్ల పనులకు ప్రారంభోత్సవాలు, పలు కుల సంఘాల భవన నిర్మాణాలను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శంకుస్థాపనలు చేశారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌, మండల జడ్పీటిసి, ఎంపిపి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »