రెంజల్, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీటీసీ ఆష్టం శ్రీనివాస్ తండ్రి గత మూడు రోజుల క్రితం మృతిచెందడంతో గురువారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డి రాజరెడ్డి,జావిదోద్దీన్, సాయరెడ్డి, మహిపాల్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్, బుక్క గంగాధర్, లక్ష్మణ్, పోశెట్టి, సద్దామ్, చిన్నోళ్ల రాకేష్ తదితరులు ఉన్నారు.