నిజామాబాద్, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్.ఎస్.యు.ఐ లో చేరి విద్యారంగా సమస్యలపై పోరాటం చేయాలని విద్యార్థులకు ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్.ఎస్.యు.ఐ కాలేజీ, పట్టణ, మండల మరియు అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలను నియమించడానికి ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తున్నారన్నారు.
కార్యక్రమానికి ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు మరియు కాలేజీ పట్టణ మండల మరియు అసెంబ్లీ కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు అధికమైపోయి విద్యార్థులు, నిరుద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారని వాటన్నింటిపైన ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి విభాగంలో విద్యార్థులు భాగస్వామ్యమై ఎన్.ఎస్.యు.ఐ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అలాగే కాలేజీ పట్టణ మండల మరియు అసెంబ్లీ స్థాయి కమిటీలలో ఎన్.ఎస్.యు.ఐలో చేరి విద్యార్థి సమస్యలపై పోరాడాలనుకునే విద్యార్థి నిరుద్యోగ మిత్రులు తమని సంప్రదించగలరని కోరారు. కార్యక్రమంలో సాయి, కన్నా, ఇమ్రాన్, సాయి, మనీ, బబ్లు, చిన్న, గోపి తదితరులు పాల్గొన్నారు.